కేరళ కొట్టాయంలో మూడు భారీ అరుదైన దున్నపోతులు దర్శనమిచ్చాయి. సద్దామ్, హుస్సేన్, షేక్ అనే పేర్లుగల ఈ దున్నపోతులు స్థానిక 'అగ్రి ఫెస్ట్' ప్రదర్శనలో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. నల్లటి శరీరం, భారీ కాయంతో చూడటానికి అచ్చం బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడితో పోరాడిన దున్నపోతుల్లా ఉన్న వీటిని తిలకించటానికి ప్రజలు తెగ సరదా పడుతున్నారు. అరుదైన జాతికి చెందిన ఈ మూగజీవాలను త్రిస్సూర్ జిల్లాకు చెందిన షానవాస్ అబ్దుల్లా.. ప్రదర్శనకు తీసుకొచ్చాడు. ఈ అగ్రిఫెస్ట్ ఇవాళ సాయంత్రం ముగియనుంది.
వయసు నాలుగున్నరేళ్లే..
దాదాపు 2వేల కిలోల బరువున్న సద్దామ్‌ను మహారాష్ట్ర నుంచి కొలుగోలు చేసినట్లు షానవాజ్ తెలిపాడు. ప్రస్తుతం సద్దామ్ వయసు నాలుగున్నరేళ్లేనని.. 1800 కిలోలున్న హుస్సేన్ వయసు కూడా 4.5 సంవత్సరాలేనన్నాడు. 1200కిలోల బరువున్న షేక్‌ను హరియాణా నుంచి తీసుకొచ్చినట్లు తెలిపాడు.