దేశవ్యాప్తంగా నేడు మూడు ప్రమాదాలు జరిగాయి. విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నగరంలోని గోపాలపట్నం వేపగుంట వద్ద ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటలకు గ్యాస్ లీకేజీ అయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మంది తీవ్ర అస్వస్థతకు గురై విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువు ప్రభావం కారణంగా మూగజీవాలు సైతం ప్రాణాలొదిలాయి.
పూర్తి కథనం:కళ్లు తెరవక ముందే కమ్మేసింది విషవాయు మేఘం
ఛత్తీస్‌గఢ్ రాయ్‌గడ్ జిల్లా తెత్లాలో విషవాయువు కారణంగా ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ పేపర్‌మిల్లులో నిరుపయోగంగా పడి ఉన్న ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు బాధితులు వెళ్లారు. చాలా కాలం నుంచి ఉపయోగించని కారణంగా ట్యాంకులో విషవాయువులు తయారయ్యాయని సమాచారం.