వైశాఖీ.. సిక్కుల నూతన సంవత్సరాది. ఏటా ఈ రోజున గురుద్వారాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు సిక్కులు. కొన్ని ప్రముఖ గురుద్వారాలు విభజన సమయంలో పాక్ భూభాగంలోనే ఉండిపోయాయి. ఇరు దేశాల మధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా అక్కడికి వెళ్లే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం హసన్ అబ్దల్ పట్టణంలో ఉన్న గురుద్వారాలో వైశాఖీని వైభవంగా నిర్వహిస్తారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10వేల మంది సిక్కులు ఆ పట్టణానికి చేరుకున్నారు. ఇస్లామాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది హసన్ అబ్దల్.
సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ చేతి ముద్ర కలిగిన రాయి ఇక్కడ ఉంది. స్నానాలు ఆచరించి పవిత్రంగా భావించే ఈ రాయిని తాకి పరవశించిపోతారు సిక్కులు. మొత్తంగా పాక్‌లో ఎనిమిది రోజులపాటు పర్యటిస్తారు. ఆ దేశంలోని అన్ని ఆలయాలను దర్శించి తిరుగు పయనమవుతారు.