తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' సెగ: కోల్​కతాలో జాతీయ రహదారి దిగ్బంధం - cab protest howrah west bengal

ఈశాన్య రాష్ట్రాలను కుదిపేస్తున్న నిరసనలు.. బంగాల్​నూ తాకాయి. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా కోల్​కతాలోని జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టారు వేలాది మంది ముస్లింలు. మతపరంగా ప్రజలను విభజించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

కోల్​కతాలో జాతీయ రహదారి దిగ్బంధం

By

Published : Dec 13, 2019, 4:37 PM IST

Updated : Dec 13, 2019, 7:04 PM IST

కోల్​కతాలో జాతీయ రహదారి దిగ్బంధం

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా బంగాల్​లో నిరసనలు చెలరేగాయి. హావ్​డా జిల్లా ఉలుబెరియా వద్ద 6వ నెంబరు జాతీయ రహదారిపై వేలాది మంది ముస్లింలు ఆందోళనలు చేపట్టారు. జాతీయ జెండా, నల్ల జెండాలు పట్టుకుని... కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టైర్లు తగలబెట్టి, రోడ్డుపై బైఠాయించారు నిరసనకారులు. ఎన్ఆర్​సీ, పౌరసత్వ చట్ట సవరణ ద్వారా ​మతపరంగా దేశ ప్రజలను కేంద్రం విభజిస్తోందని ఆరోపించారు. జిల్లా మేజిస్ట్రేట్​ వచ్చి తమ డిమాండ్లను వినేంత వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

కోల్​కతాను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే రహదారుల్లో ఎన్​హెచ్​-6 ప్రధానమైంది. ఈ అత్యంత రద్దీగా ఉండే ఈ రోడ్డుపై నిరసనలో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.

ఇదీ చూడండి:- 'పౌర' చట్టాన్ని సవాల్​ చేస్తూ సుప్రీంలో వ్యాజ్యం

Last Updated : Dec 13, 2019, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details