తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషుల్ని అందుకే ఎన్​కౌంటర్​ చేయలేదు!

పశువైద్యురాలిని హత్యాచారం చేసిన దుండగులను ఎన్​కౌంటర్​ చేసిన క్రమంలో నిర్భయ కేసు దర్యాప్తు చేసిన దిల్లీ మాజీ కమిషనర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్భయ ఘటన సమయంలో తమపై ఒత్తిడి ఉన్నా.. దోషులను ఎన్​కౌంటర్​ చేయాలనే ఆలోచనే రాలేదని వ్యాఖ్యానించారు.

Nirbhaya case
నిర్భయ దోషుల్ని ఎన్​కౌంటర్​ చేయంది అందుకే!

By

Published : Dec 6, 2019, 6:16 PM IST

Updated : Dec 6, 2019, 7:30 PM IST

'దిశ' హత్యాచార ఘటనలో నలుగురు నిందితులను హైదరాబాద్​ పోలీసులు ఎన్​కౌంటర్ చేయడంపై స్పందించారు దిల్లీ మాజీ కమిషనర్​ నీరజ్​ కుమార్​. గతంలో నిర్భయ హత్యాచార కేసును పర్యవేక్షించించిన ఆయన.. ఆ సమయంలో తమపై చాలా ఒత్తిడి వచ్చిందన్నారు. నిందితులను చంపాలనే ఆలోచన మాత్రం తమకు రాలేదని స్పష్టం చేశారు.

" నిర్భయ ఘటన జరిగిన సమయంలో ప్రజల నుంచి మాకు చాలా సందేశాలు వచ్చాయి. దోషులను ఆకలిగా ఉన్న సింహాల ముందు వేయాలని, బహిరంగంగా వారి వృషణాలు తొలగించాలని, ఉరి తీయాలని కోరారు. కానీ మేము మా తుపాకులను తీయలేకపోయాం. ప్రతి ఎన్​కౌంటర్​ తర్వాత.. చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. హైదరాబాద్​ ఎన్​కౌంటర్​ తీవ్రవాదులు, గ్యాంగ్​స్టర్ల మధ్య జరిగింది కాదు. వాస్తవానికి అక్కడ ఏమి జరిగిందో దర్యాప్తు చేసేందుకు న్యాయ ప్రక్రియ ఉంది. ఎన్​కౌంటర్​ సరైనదో కాదో తెలుసుకునేందుకు దాని ఫలితాల కోసం వేచి ఉన్నాం. "

- నీరజ్​ కుమార్​, దిల్లీ పోలీస్ మాజీ ​ కమిషనర్​.

'ద ఖాకీ ఫైల్స్​' పుస్తకంలో తనకు ఎదురైన సంఘటనను గుర్తు చేసుకున్నారు నీరజ్​. నిర్భయ కేసు సమయంలో తన కూతుళ్లను అత్యాచారం చేస్తామని బెదిరింపులు వచ్చాయని.. రాజీనామా చేయాలని డిమాండ్​ వచ్చినట్లు రాశారు.

నిర్భయ ఘటన ఆధారంగా నెట్​ ఫ్లిక్స్​లో వచ్చిన 'దిల్లీ క్రైమ్స్​'లోనూ ఈ కేసు వెనకాల రాజకీయ హస్తం ఉన్నట్లు చూపించారు.

ఇదీ చూడండి: 'దిశ'కు న్యాయం- సజ్జనార్​ స్వస్థలంలో సంబరం

Last Updated : Dec 6, 2019, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details