తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ జీ.. బెదిరింపులకు అందరూ లొంగరు' - cogress latest news

రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​కు విరాళాలపై కేంద్రం విచారణకు ఆదేశించడంపై ట్విట్టర్​లో స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. ప్రపంచమంతా తనలానే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని విమర్శించారు. ప్రలోభాలు, బెదిరింపులతో అందరినీ భయపెట్టలేరని ధ్వజమెత్తారు.

Those who fight for the truth cannot be intimidated: Rahul Gandhi on govt probe into Rajiv Gandhi Foundation.
'మోదీ జీ.. ప్రలోభాలకు, బెదిరింపులకు అందరూ లొంగరు'

By

Published : Jul 8, 2020, 5:37 PM IST

రాజీవ్ గాంధీ ఫౌండేషన్​కు విరాళాల సేకరణలో అవకతవకల ఆరోపణలపై విచారణకు కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రపంచమంతా మోదీలా ఉండదని ట్వీట్​ చేశారు. వాస్తవం కోసం పోరాడుతున్న వారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగరని వ్యాఖ్యానించారు.

" ప్రపంచమంతా ఆయన లాగే ఉంటుందని మోదీ విశ్వసిస్తారు. ఎవరినైనా ప్రలోభ పెట్టవచ్చని, బెదిరించవచ్చని భావిస్తారు. వాస్తవం కోసం పోరాడే వారు వీటికి లొంగరని మోదీ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు."

-రాహుల్ గాంధీ ట్వీట్​.

ఆర్థిక వ్యవస్థ నాశనం...

దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్రాన్ని తప్పుబట్టారు రాహుల్​. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నాశనం అయ్యాయని, భారీ పరిశ్రమలు, బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని దుయ్యబట్టారు. దేశంలో ఆర్థిక సునామీ రాబోతోందని నెలల క్రితమే తాను హెచ్చరిస్తే భాజపా, మీడియా ఎద్దేవా చేశాయని రాహుల్‌ గుర్తు చేశారు.

ఇదీ చూడండి: 'ట్రస్ట్' పాలిటిక్స్​: చట్ట ఉల్లంఘనా? కక్షసాధింపా?

ABOUT THE AUTHOR

...view details