బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిని ఉత్తర్ప్రదేశ్ తరహాలో కాల్చిపారేయాలంటూ వ్యాఖ్యానించారు. నదియా జిల్లాలో ఆదివారం పర్యటించిన దిలీప్ ఘోష్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బంగాల్‌లో పౌర చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. డిసెంబర్‌లో కొంతమంది రైల్వే, ప్రజారవాణా ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో... ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారిపై దీదీ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన ఘోష్... కాల్పులు జరపడానికి, లాఠీఛార్జి చేయడానికి ఆదేశాలు ఇవ్వలేదని మండిపడ్డారు.