తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బుల్లెట్ల శక్తి కంటే అభివృద్ధి శక్తి గొప్పది' - చంద్రయాన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్​కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు సందేశమిచ్చారు. కశ్మీర్​లో విద్వేషాలు రెచ్చగొట్టి, అభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారి ప్రయత్నాలు సఫలం కావన్నారు. చంద్రయాన్ 2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రజ్ఞులకు ఈ కార్యక్రమం ద్వారా అభినందనలు తెలిపారు మోదీ.

'బుల్లెట్ల శక్తి కంటే అభివృద్ధి శక్తి గొప్పది'

By

Published : Jul 28, 2019, 1:06 PM IST

బుల్లెట్లు, బాంబుల శక్తి కంటే అభివృద్ధికి ఉండే బలం గొప్పదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కశ్మీర్​లో విద్వేషాలు రెచ్చగొట్టి, అభివృద్ధిని నిరోధించాలనుకునేవారి ఆటలు సాగవన్నారు. జమ్ముకశ్మీర్​లో జూన్​లో జరిగిన 'బ్యాక్ టూ విలేజ్'(గ్రామాలకు మళ్లుదాం) కార్యక్రమంలో అక్కడి ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు మోదీ. కశ్మీర్ ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి ప్రవేశిస్తుందనడానికి ఆ రాష్ట్ర ప్రజల స్పందనే నిదర్శనమని ఉద్ఘాటించారు.

చంద్రయాన్ ఫలితాలపై ఆసక్తి: మోదీ

చంద్రయాన్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. చంద్రయాన్ 2 ద్వారా చంద్రుడిపైకి పంపిన రోవర్ సెప్టెంబర్​లో ఫలితాలను తెలపనుందని ఆ నెల కోసం వేచిచూస్తున్నామని స్పష్టం చేశారు.

అమర్​నాథ్​పై...

జులై 1 వరకు 3 లక్షలమంది అమర్​నాథ్ యాత్రను పూర్తి చేశారని, 2015లో 60 రోజులపాటు వెళ్లిన యాత్రికుల సంఖ్యకు ఇది సమానమని మోదీ తెలిపారు. యాత్రికులకు రాష్ట్ర ప్రజలు అందించిన సహకారంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.

జల సంరక్షణ

ఈశాన్య రాష్ట్రం మేఘాలయ సొంత జలవిధానాన్ని తయారు చేసినందుకు అభినందనలు తెలిపారు మోదీ. తక్కువ నీటితో పంటసాగుకు హరియాణా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సంతోషం వ్యక్తం చేశారు. వరుసగా పండగలు జరగనున్నాయని, వీటిని పురస్కరించుకుని జలసంరక్షణ సందేశం ఇవ్వాలి.

విద్యార్థులకు...

కాన్సర్​ను అధిగమించి మాస్కోలో జరిగిన కాన్సర్ విజయుల క్రీడా టోర్నీలో పతకాలు గెలిచిన పదిమంది బాలలకు శుభాశీస్సులు తెలిపారు ప్రధాని. వారు ఆటలోనే కాదని జీవితంలోనూ విజయం సాధించారన్నారు.

అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి విద్యార్థులకు జాతీయ స్థాయి క్విజ్ పోటీని నిర్వహిస్తామన్నారు. గెలిచిన వారిని సెప్టెంబర్​లో చంద్రయాన్ ఫలితాల సందర్భంగా శ్రీహరికోటకు ప్రభుత్వం తీసుకెళుతుందన్నారు.

స్వచ్ఛభారతం...

స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మరుగుదొడ్లను నిర్మించామన్నారు. స్వచ్ఛత నుంచి ఈ కార్యక్రమం సుందరీకరణ వైపు మళ్లుతోందని తెలిపారు. స్వచ్ఛతపై పలువురు చేసిన కృషికి మన్​కీబాత్​లో మోదీ అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి: కర్ణాటకీయం: 14 మంది రెబల్​ ఎమ్మెల్యేలపై వేటు

ABOUT THE AUTHOR

...view details