హిందుత్వ భావజాల సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వకూడదని డిమాండ్ చేసేవారంతా అండమాన్ జైలును చూడాలని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు. రెండు రోజులు పాటు ఆ జైలులో గడిపితే బ్రిటిషువారి చేతిలో సావర్కర్ పడిన బాధలేమిటో తెలుస్తాయన్నారు. బ్రిటిషువారికి క్షమాబిక్ష పత్రం సమర్పించినట్లు వాదనలు ఉన్నందున భారతరత్న ఇవ్వకూడదని కాంగ్రెస్ అంటోంది. ఒకవేళ ఆయనకు ఇస్తే ఆ జైలులో శిక్ష అనుభవించి క్షమాభిక్ష అడగని యోధులందరికీ భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకొనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
1911లో నాసిక్ జిల్లా కలెక్టర్ ఎ.టి.ఎం జాక్సన్‌ను హత్య చేసిన కేసులో దోషిగా తేలడం వల్ల సావర్కర్‌కు అండమాన్ జైలులో శిక్ష విధించారు. ప్రస్తుతం ఈ జైలును స్మారక కేంద్రంగా మార్చారు.
హిందుత్వవాదులే సందర్శించాలి:కాంగ్రెస్