మజ్లిస్ పార్టీపై పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ నుంచి డబ్బుల సంచులతో వస్తున్న కొంతమంది నేతలు తాము ముస్లిం సానుభూతిపరులమంటూ చెప్పుకుంటున్నారని మమత వ్యాఖ్యానించారు. కానీ వారు భాజపాకు అతిపెద్ద మిత్రపక్షమని...మజ్లిస్ నేతలను ఉద్దేశించి మమతా బెనర్జీ ఘాటు విమర్శలు చేశారు.
'అసద్'పై మరోసారి బంగాల్ సీఎం మాటలదాడి
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోసారి మజ్లిస్ నేతలను ఉద్దేశించి మమతా ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర నేతలు మాత్రమే బంగాల్ ప్రజల కోసం పోరాడుతారని వ్యాఖ్యానించారు.
'అసద్'పై మరోసారి బంగాల్ సీఎం మాటలదాడి
బయట నుంచి వచ్చిన నేతలను నమ్మవద్దని రాష్ట్ర నేతలపైనే నమ్మకం ఉంచాలని సాగర్ దిఘిలో జరిగిన బహిరంగ సభలో ముస్లింలను మమతా బెనర్జీ కోరారు. రాష్ట్ర నేతలు మాత్రమే బెంగాల్ ప్రజల కోసం పోరాడుతారని వ్యాఖ్యానించారు.