దేశవ్యాప్తంగా ప్రారంభమైన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్... ఇప్పటివరకు ప్రపంచంలో ఇంత పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగలేదని వ్యాఖ్యానించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో భారత్‌కు మంచి అనుభవం ఉందని అన్నారు. పోలియో, మశూచి(స్మాల్ పాక్స్) వంటి వ్యాధులను అరికట్టడంలో భారత్ సఫలీకృతమైందని గుర్తుచేశారు. కొవిడ్ కట్టడిలో ఈ వ్యాక్సిన్ సంజీవనిలా పనిచేస్తుందని అన్నారు.
ఎయిమ్స్ డైరెక్టర్‌కూ టీకా.....
వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికి దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా కొవిడ్ టీకా డోసును తీసుకున్నారు.
ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, ఎస్ఓఏ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ అశోక్ మొహాపాత్ర కొవిడ్ టీకా డోసును తీసుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎస్యూఎమ్ ఆసుపత్రిలో ఆయన టీకా తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
టీకా తీసుకున్న ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
ఇదీ చదవండి:'ఒక దేశం- రెండు వ్యాక్సిన్లు.. ఇదీ భారత్ సత్తా'