మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ మిఠాయి దుకాణం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు కారణం... అక్కడ విక్రయిస్తున్న స్వీట్లే. రుచి సంగతేమో కానీ... ధర మాత్రం అందరినీ నివ్వెరపరుస్తోంది.
ఒక కిలో మిఠాయి ధర అక్షరాలా 9వేల రూపాయలు. ఖరీదు ఇంత ఎక్కువగా ఉండడానికి కారణం... వాటిలో బంగారం ఉండటమే. రకరకాల మిఠాయిలను తయారు చేసి, వాటికి బంగారు పూత వేసి రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేకంగా విక్రయిస్తోందీ దుకాణం.