రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి రిటైర్! మరో రెండు రోజుల్లో బిహార్ ఎన్నికల సమరం ముగుస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే తన చివరి ఎన్నికలని పేర్కొన్నారు.
పూర్ణియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నితీశ్. బిహార్ ఎన్నికల ప్రచారాలకు గురువారం చివరి రోజు అని.. తనకు కూడా ఇదే చివరి ఎన్నిక అని వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
69ఏళ్ల నితీశ్ కుమార్ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఆరు పర్యాయాలు బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్లో ఎంపీగా 7సార్లు ఉన్నారు.
243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్లో ఈ నెల 7న చివరి దశ పోలింగ్ జరగనుంది. 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి:-35 ఏళ్లుగా ఎమ్మెల్యే కాలేదు.. కానీ 6 సార్లు సీఎం!