తెలంగాణ

telangana

హాకీ మైదానంలో బాల్​బాయ్​గా 'మహ్మద్​ కైఫ్' ​

By

Published : Feb 2, 2020, 10:55 AM IST

Updated : Feb 28, 2020, 8:53 PM IST

కేరళ కొల్లం జిల్లాకు చెందిన పదమూడేళ్ల బాలుడికి హాకీ అంటే ప్రాణం. కేరళ తరఫున వివిధ పోటీల్లో పాల్గొన్నాడు. హాకీ క్రీడలో మెలుకువలు నేర్చుకునేందుకు బాల్​బాయ్​ అవతారమెత్తాడు. 10వ జాతీయ సీనియర్​ హాకీ ఛాంపియన్​షిప్​లో మైదానంలో ఆట ముగిసేవరకు ఉండి.. క్రీడాకారులకు సహాయం చేయటం సహా.. మైదానం శుభ్రపరచటం వంటి పనులు చేస్తూ అందరి మనసులు గెలుచుకున్న ఆ చిన్నారి గురించి మీకోసం.

Thirteen-year-old Mohammed Kaif won hearts in the national women's hockey championship in kollam, kerala
హాకీ మైదానంలో సేవ.. మనుసు గెలిచిన 'మహ్మద్​ కైఫ్'​

హాకీ మైదానంలో బాల్​బాయ్​గా 'మహ్మద్​ కైఫ్' ​

కేరళ కొల్లం జిల్లాలో '10వ జాతీయ సీనియర్​ మహిళా హాకీ ఛాంపియన్​షిప్' జరుగుతోంది. పోటీలు హోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో.. మైదానంలో ఓ 13 ఏళ్ల ముహమ్మద్​ కైఫ్​ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బాల్​బాయ్​గా క్రీడాకారులకు అవసరమైనప్పుడు బంతిని అందించడమే కాదు.. వారికి నీళ్లు, తేనీరు అందిస్తూ ఆటగాళ్లతో పాటు హాకీపై తనకున్న గౌరవాన్ని చాటుతున్నాడు. మైదానంలో చురుకుగా కదులుతూ.. అందరి మనుసులు గెలిచాడు.

కొల్లం స్పోర్ట్​ అకాడమీ నుంచి పలు పోటీల్లో కేరళ తరఫున పాల్గొన్న కైఫ్​.. హాకీలో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకే తాను మైదానంలోకి వస్తున్నట్లు తెలిపాడు. ఆటగాళ్లకు సాయం చేస్తూనే.. ఎంతో నేర్చుకోవచ్చని చెబుతున్నాడు.

బిహార్​కు చెందిన జుమ్మానత్తాఫ్​, గుల్జన్​ల దంపతుల కుమారు కైఫ్​. వారు కొన్నేళ్ల క్రితం.. కేరళకు వలస వచ్చారు. ఇక్కడే.. కొల్లం స్పోర్ట్స్​ అకాడమీలో క్రీడా స్ఫూర్తికి సానపెడుతున్నాడు కైఫ్​.

ఇదీ చదవండి:వుహాన్​ నుంచి దిల్లీ వచ్చిన ఆ 140మందికి కరోనా​!

Last Updated : Feb 28, 2020, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details