తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దు ఘర్షణలపై భారత్​-చైనా మరోసారి భేటీ - india-china border

Third round of Commander-level talks between India, China
సరిహద్దు ఘర్షణలపై భారత్​-చైనా మరోసారి భేటీ

By

Published : Jun 30, 2020, 10:45 AM IST

Updated : Jun 30, 2020, 12:08 PM IST

10:27 June 30

సరిహద్దు ఘర్షణలపై భారత్​-చైనా మరోసారి భేటీ

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్-చైనా సైనికాధికారులు మరోసారి సమావేశమయ్యారు. ఈ నెల‌ 6, 22వ తేదీల్లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపు ఉన్న మోల్డో ప్రాంతంలో ఇరుదేశాల లెఫ్టినెంట్‌ జనరళ్లు చర్చలు జరపగా.. ఈ సారి భారత్‌ వైపు ఉన్న చుషుల్‌లో భేటీ అయ్యారు. 

గల్వాన్‌ లోయలో హింసాత్మక ఘర్షణల తర్వాత జూన్‌ 22న జరిగిన భేటీలో వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక బలగాలను ఉపసంహరించాలని.. భారత్‌, చైనా ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ సారి సమావేశంలో తూర్పు లద్దాఖ్‌లోని సున్నితమైన ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి రప్పించే దిశగా విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గల్వాన్‌ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతలు తగ్గించే మార్గాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

Last Updated : Jun 30, 2020, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details