తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: కొనసాగుతున్న మూడో దశ పోలింగ్​

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 117 నియోజకవర్గాల్లో ఓటింగ్​ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

By

Published : Apr 23, 2019, 7:23 AM IST

Updated : Apr 23, 2019, 8:41 AM IST

ప్రారంభమైన మూడో దశ పోలింగ్​

సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో 117 నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని ఆయా స్థానాల నుంచి మొత్తం 1640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఓటర్ల సంఖ్య 18 కోట్ల 85.

భారీ ఏర్పాట్లు...

మూడో దశ పోలింగ్​ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 2లక్షల 10 వేలకుపైగా పోలింగ్​ కేంద్రాలు నెలకొల్పింది. మొదటి రెండు విడతల్లో ఈవీఎంలు మొరాయింపు ఎన్నికల సంఘానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈసారి ఈవీఎంలపై ప్రత్యేక దృష్టి సారించింది ఈసీ. నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

ప్రముఖుల భవితవ్యం...

భాజపా అధ్యక్షుడు అమిత్​ షా, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, సీనియర్​ నేతలు శశిథరూర్​, మల్లికార్జున్​ ఖర్గే, ములాయం సింగ్​ యాదవ్​, జయప్రద, ఆజంఖాన్​ వంటి ప్రముఖులు మూడో దశలోనే అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

ఓటరులారా.... తరలిరండి: మోదీ

మూడో విడతలో రికార్డు స్థాయిలో ఓటింగ్​ నమోదుచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు విలువైనదని, రాబోయే సంవత్సరాల్లో దేశ గతిని నిర్ణయిస్తుందని ట్వీట్​ చేశారు.

Last Updated : Apr 23, 2019, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details