కర్ణాటకలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది యడియూరప్ప సర్కార్. పోలీసులు నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా మాస్క్ లేకుండా కనిపించిన ఇద్దరు వ్యక్తులకు జరిమానా విధించారు. తమకు ఫైన్ వేశాడనే కోపంతో పోలీస్ బైక్ను దొంగిలించారు ఆ దుండగులు.
ఏం జరిగిందంటే?
హోసానగర్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టారు అధికారులు. మాస్క్ లేకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను గమనించి.. వారికి జరిమానా విధించారు. తమ వద్ద డబ్బుల్లేవని బాధితులు చెప్పారు. దీంతో వారిని స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం వదిలేశారు.