దొంగతనం కోసం వినూత్న పద్ధతిని ఎంచుకుంది ఓ ముఠా. అంబులెన్స్‌లో వచ్చి చోరీకి యత్నించింది. ఈ సంఘటన కర్ణాటక బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలో జరిగింది.
ఏం చేశారంటే..
ఈనెల 1న అంబులెన్స్‌లో వచ్చిన ముగ్గురు దుండగులు ఉపకార్ డెవలపర్స్ కంపెనీలోకి చొరబడ్డారు. తలుపులు పగలకొట్టి లోపలకు ప్రవేశించారు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా వాటికి రంగు పులిమారు. అయితే, ఆ కంపెనీలో నగదేమీ లేనందున నిరాశతో వెనుదిరిగారు.