దేశంలో రోజురోజుకూ ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలోనూ వీటిపై ఎన్నో జోకులు పేలుతున్నాయి. పలుచోట్ల దుకాణాల్లో, మార్కెట్లలో రవాణా అవుతుండగానే దారి మధ్యలో చోరీలకు గురవుతున్నాయి. తాజాగా తమిళనాడు మదురైలోని ఓ కిరాణా దుకాణంలో, ఉత్తరాఖండ్ ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఇలాంటి దోపిడీలు జరిగాయి. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.
తమిళనాడు..
తమిళనాడు మదురైలోని ఓ కిరాణా దుకాణంలో ఉల్లిగడ్డలను దొంగిలించాడో వ్యక్తి. అబ్దుల్ రెహ్మాన్ ఓ షాపునకు వెళ్లి అక్కడ పనిచేసే మహిళ దృష్టిని మళ్లించి... ఉల్లిగడ్డలు చోరీచేశాడు. తర్వాత.. ఏమీ ఎరగనట్లు సాదాసీదాగా అక్కడి నుంచి జారుకున్నాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. 2 కేజీల ఉల్లిగడ్డలతో సహా ఇతర వస్తువులను దొంగిలించిన్నట్లు అధికారులు వెల్లడించారు.