కరోనా వైరస్ సెగ పార్లమెంట్ సమావేశాలనూ తాకింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎంపీలు, సందర్శకులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు చేయించుకుంటేనే పార్లమెంట్‌లోకి అడుపెట్టనిస్తున్నారు అధికారులు.
కరోనా వైరస్‌పై పోరులో భాగంగానే ఈ చర్యలు చేపట్టింది కేంద్రం. ఇప్పటికే దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా అనుమానితులను తక్షణమే నిర్బంధ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తోంది.
సుప్రీంలోనూ...
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తొన్న తరుణంలో సుప్రీంకోర్టు ప్రాంగణంలోనూ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సభ్యుల శరీర ఉష్ణోగ్రత రికార్డు చేశారు.