తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఛానల్​పై సుప్రీం ఫైర్​- మీడియాపై కీలక వ్యాఖ్యలు

సుదర్శన్​ టీవీకి సంబంధించిన ఓ కార్యక్రమంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'సివిల్​ సర్వీసు ఉద్యోగాల్లో ఓ వర్గం వారిని అధిక సంఖ్యలో చేర్చేందుకు కుట్ర' అంటూ సదరు టీవీ ఛానల్​ ప్రోమోలు విడుదల చేసింది. ఈ అంశంపై సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

says SC
ఆ టీవీ​ కార్యక్రమంపై సుప్రీం ఫైర్​- మీడియాపై కీలక వ్యాఖ్యలు

By

Published : Sep 15, 2020, 3:32 PM IST

Updated : Sep 15, 2020, 5:31 PM IST

మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 'సివిల్​ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగా తీసుకునేందుకు కుట్ర జరిగింది' అని సుదర్శన్​ టీవీ ఛానల్​ ప్రోమోలు ప్రసారం చేయడంపై న్యాయస్థానం మండిపడింది. ఈ కార్యక్రమంపై దాఖలైన పిటిషన్​ను విచారించింది. కొన్ని ఛానళ్లు నిర్వహిస్తోన్న డిబేట్​లు ఆందోళన కలిగిస్తున్నాయని జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

ఈ కార్యక్రమం ఎంతో వివక్షాపూరితంగా ఉంది. ఓ వర్గం మాత్రమే సివిల్​ సర్వీసుల్లోకి అడుగుపెడుతుంది అని ప్రసారం చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఎంత అవమానకరంగా ఉంది. ఎలాంటి వాస్తవిక ఆధారాలు లేకుండా మొత్తం యూపీఎస్​సీ పరీక్షలనే కించపరిచేలా ఉంది.

- సుప్రీం ధర్మాసనం

'బిందాస్​ బోల్​' అనే ఈ కార్యక్రమం ప్రసారాన్ని రెండు రోజులపాటు నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సదరు కార్యక్రమం.. ఓ వర్గాన్ని దూషించేదిగా ఉందని ప్రాథమిక విచారణలో తేల్చినట్లు సుప్రీం స్పష్టంచేసింది. సెప్టెంబర్​ 17న పిటిషన్​పై మరోసారి విచారణ చేపడతామని పేర్కొంది.

న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు

పత్రికా, మీడియా స్వేచ్ఛ అన్నింటికన్నా ముఖ్యమని, అయితే ప్రజ్వాస్వామ్యంలో వాటిని నియంత్రించే సందర్భం రావడం అత్యంత దురదృష్టకరమని సొలిసిటర్​ జనరల్​ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

సుదర్శన్​ టీవీ తరఫున శ్యామ్​ దివాన్​ వాదనలు వినిపించారు. సదరు కార్యక్రమంలో ప్రసారం చేసిన అంశాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన పరిశోధనాత్మక కథనంగా సుదర్శన్​ టీవీ చూసినట్లు కోర్టుకు విన్నవించారు. అయితే ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది.

"మీ కక్షిదారు ప్రసారం చేసిన కార్యక్రమం దేశానికి హాని చేసేదిగా ఉంది. భారత్​.. విభిన్న సంస్కృతుల కలయిక అని సదరు ఛానల్​ అంగీకరించడం లేదు. మీడియా స్వేచ్ఛను పరిగణించే అంశంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది."

- సుప్రీం ధర్మాసనం

Last Updated : Sep 15, 2020, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details