భారత్లో దక్షిణాఫ్రికా వేరియంట్ కొవిడ్ వ్యాప్తి జరిగిందనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం స్పష్టం చేసింది. ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈమేరకు వెల్లడించారు.
దేశంలో ఇప్పటివరకు 63,10,194 కొవిడ్ టీకాలు అందించామని వెల్లడించారు భూషణ్. ఏడు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో గత మూడు వారాలుగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తెలిపారు. 15 రాష్ట్రాల్లో సోమవారం కరోనా వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పారు.