తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రణబ్​ ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పూ లేదు' - ప్రణబ్​ ముఖర్జీ హెల్త్​ న్యూస్​

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కీలక పారామితులన్నీ స్థిరంగా ఉన్నాయని చెప్పారు.

There is no change in the medical condition of Former President Pranab Mukherjee
విషమంగానే ప్రణబ్​ ఆరోగ్యం పరిస్థితి

By

Published : Aug 18, 2020, 11:30 AM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. ఈ మేరకు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రణబ్​ కీలక సూచీలన్నీ బాగున్నాయని.. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. అప్పటికే ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈనెల 10న ఆపరేషన్​ నిర్వహించారు.

ఇదీ చూడండి:'కంపా నిధుల్ని అటవీకరణకే వెచ్చించాలి'

ABOUT THE AUTHOR

...view details