తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నన్ను క్షమించండి... మీ దుకాణంలో దొంగతనం చేశాను' - theif letter in tamilanadu

అతడో దొంగ.. రాత్రి పూట ఒక సూపర్​ మార్కెట్​లోకి చొరబడ్డాడు. అందినకాడికి అన్నీ సర్దుకున్నాడు. అయితే వెళ్లే ముందు ఓ లేఖ రాసి పెట్టాడు. ఇదేంటి దొంగ.. లేఖ రాయడం అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి.

Theif left an apology note after stealing goods worth Rs 65000
'నన్ను క్షమించండి... మీ దుకాణంలో దొంగతనం చేశాను'

By

Published : Oct 11, 2020, 12:33 PM IST

ఓ సూపర్​ మార్కెట్​లో చోరీ జరిగింది. అయితే దొంగతనం చేసిన వ్యక్తి.. తనను క్షమించాలని వేడుకుంటూ ఓ లేఖ రాసి పెట్టాడు. తమిళనాడులోని మధురై జిల్లాలో జరిగిందీ సంఘటన.

ఏం జరిగిందంటే..?

మధురైలోని ఉసిలంపట్టి ప్రాంతంలో రామ్​ ప్రకాశ్​​ అనే వ్యక్తి ఓ సూపర్​ మార్కెట్​ను నడుపుతున్నాడు. కొన్నిరోజుల క్రితం అతను రోజూలాగే ఉదయాన్నే షాపుకు వచ్చాడు. తలుపులు తెరిచి చూస్తే రూ.65,000 విలువగల కంప్యూటర్లు, ఒక టీవీ, రూ.5,000 నగదు మాయమయ్యాయి.

కన్నం వేసిన దొంగ

'నా మూడు నెలల ఆదాయం'

షాపులోనే రామ్​ ప్రకాశ్​కు ఓ కాగితం కనిపించింది. అది చదివి అవాక్కయ్యాడు ప్రకాశ్. చోరీ చేసినందుకు క్షమించమని వేడుకుంటూ దొంగ రాసిన ఉత్తరం అది.

" నన్ను క్షమించండి. నాకు చాలా ఆకలివేస్తుంది. నేను చేసిన ఈ దొంగతనం వల్ల మీరు మీ ఒక్కరోజు సంపాదన నష్టపోతారు. కానీ, అది నా మూణ్నెళ్ల ఆదాయానికి సమానం. మరొక్కసారి మీకు నా క్షమాపణలు "

-- ఉత్తరంలో దొంగ రాసిన మాటలు

'నన్ను క్షమించండి... మీ దుకాణంలో దొంగతనం చేశాను'

ఈ విషయం గురించి పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాడు రామ్​ ప్రకాశ్​. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూపర్​ మార్కెట్​లోని సీసీటీవీ దృశ్యాలు, వేలిముద్రల ద్వారా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details