భారత్‌ను కరోనా వైరస్ కలవరపెడుతోంది. కేరళలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా ఆరుగురికి వ్యాధి నిర్ధరణ అయినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 15కు చేరింది.
థియేటర్లు బంద్...
వైరస్ భయంతో ఇప్పటికే రాష్ట్రంలోని సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. వివిధ మలయాళీ సినీ సంస్థలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
'శబరిమలకు రాకండి...'
కేరళలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో శబరిమల ఒకటి. అయప్ప స్వామి దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు శబరిమలకు తరలివెళ్తారు. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. భక్తులు శబరిమలను సందర్శించకపోవడం మంచిదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు చెప్పారు. వేడుకలను రద్దు చేసుకోవాలని ఇతర ఆలయాలకు సూచించారు.