తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టిక్​టాక్​ కోసం రైలు ఇంజిన్ ఎక్కిన యువకుడు - బిహార్ వార్తలు

సామాజిక మాధ్యమాల్లో సాహసోపేత వీడియో చేయాలనుకున్న బిహార్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించాడు. నడుస్తున్న ఎలక్ట్రిక్​ రైలు ఇంజిన్​ ఎక్కి కూర్చున్నాడు. ఇది గమనించిన రైల్వే సిబ్బంది తర్వాత స్టేషన్​లో కిందికి దింపారు.

bihar, train, tiktok
టిక్​టాక్​ వీడియో

By

Published : Feb 8, 2020, 12:03 PM IST

Updated : Feb 29, 2020, 3:09 PM IST

సామాజిక మాధ్యమాలకు బానిసవుతున్న యువత ప్రాణాలనూ లెక్కచేయట్లేదు. సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాంతక విన్యాసాలకు తెగిస్తున్నారు. తాజాగా బిహార్​లో ఇలాంటి ఘటనే జరిగింది.

టిక్​టాక్​లో సాహసోపేత వీడియో చేయాలనుకున్న ఓ యువకుడు.. కివూల్​- జముయీ స్టేషన్ల మధ్య ఎర్నాకులం సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​​ రైలు ఇంజిన్​పైకి ఎక్కాడు. ఇది గమనించిన మానన్​పుర్​ స్టేషన్​ మాస్టర్​.. తర్వాత వచ్చే భలుయీ స్టేషన్​కు సమాచారం అందించారు.

భలుయీలో ఎర్నాకులం రైలును ఆపి.. ఆ యువకుడిని కిందికి దింపినట్లు సమాచారం.

టిక్​టాక్​ కోసం రైలు ఇంజిన్ ఎక్కిన యువకుడు

రైలు ఇంజిన్​పై ఉండే హైవోల్టేజీ వైర్లు అత్యంత ప్రమాదకరం. వాటికి తగిలితే క్షణాల్లో ప్రాణాలను హరిస్తాయి.

Last Updated : Feb 29, 2020, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details