తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనా 'షేరిట్​'ను తలదన్నే స్వదేశీ యాప్​ వచ్చేసింది! - india bycotting china apps

గత కొన్ని రోజులుగా మన ఫోన్లలో చైనా యాప్​లను తీసిపారేయాలని చాలా మంది అంటున్నారు. మరి ఇన్నాళ్లుగా అలవాటైపోయిన ఆ యాప్​లు డిలీట్​ చేస్తే.. వాటి స్థానాన్ని భర్తీ చేసే స్వదేశీ యాప్​లు ఉన్నాయా? ఇదే ప్రశ్న కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి మదిలో మెదిలింది. వెంటనే తనవంతుగా చైనా యాప్​కు ప్రత్యామ్నాయంగా 'జీ షేర్​ యాప్'​ను సృష్టించేశాడు. 'షేరిట్'​ను తలదన్నేలా.. సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ఈ యాప్​కు కేవలం 24 గంటల్లోనే విపరీతమైన ప్రజాదరణ దక్కింది.

SHARE
చైనా 'షేరిట్​'ను తలదన్నే స్వదేశీ యాప్​ వచ్చేసింది!

By

Published : Jun 29, 2020, 12:03 PM IST

Updated : Jun 29, 2020, 12:22 PM IST

చైనా 'షేరిట్​' యాప్​ను తలదన్నేలా 'జీ షేర్'​ యాప్​ను సృష్టించాడు కర్ణాటకకు చెందిన శ్రవణ్​ హెగ్డె. ఉత్తర కర్ణాటక, సిద్ధాపుర్​ తాలుకాకు చెందిన శ్రవణ్​ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. ధార్వాఢాలో కంప్యూటర్​ అప్లికేషన్స్​లో డిగ్రీ చివరి సంవత్సరం చేస్తున్నాడు. విద్యార్థి దశలోనే ఎన్నో ప్రయోగాలు చేశాడు శ్రవణ్​. అందులో బాగంగానే 'ఎగ్జామ్ పేపర్' యాప్​ను రూపొందించాడు.

స్వదేశీ జీ షేర్​ యాప్
శ్రవణ్​ హెగ్డె

ఇక, గల్వాన్​ ఘటన తర్వాత చైనా యాప్​లకు ప్రత్యామ్నాయం కనిపెట్టాలనుకున్నాడు శ్రవణ్​. భారతీయలు ఫొటోలు, వీడియోలు, యాప్​లు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్​కు ఇంటర్నెట్​ లేకుండా పంపించడానికి షేరిట్​ యాప్​ను అధికంగా వాడుతున్నరని గ్రహించాడు. 15 రోజులు తీవ్రంగా శ్రమించి షేరిట్​ యాప్​లో ఉండే ఫీచర్లతో స్వదేశీ జీ షేర్​ కనిపెట్టేశాడు.

జీ షేర్​ యాప్​ గూల్​ ప్లేస్టోర్​లో పెట్టిన 24 గంటల్లోనే భారతీయులను మెప్పించింది. ఒక్కరోజులో స్వదేశీ జీ షేర్​ యాప్​ను 3,700 మంది డౌన్లోడ్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.

ఇదీ చదవండి: కరోనా నమూనాలు సేకరిస్తున్న రోబో!

Last Updated : Jun 29, 2020, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details