నీల్‌కురంజి పుష్పాలు మరోసారి వికసించాయి. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి పుష్పించే ఈ పువ్వులు తాజాగా మధ్యప్రదేశ్‌లోని పచ్‌మరి ప్రాంతంలో దర్శనమిచ్చాయి. చివరిసారిగా 2006లో కేరళలోని మన్నార్ ప్రాంతంలో వికసించిన నీల్‌కురంజి ఈసారి కాస్తా ఆలస్యంగా పుష్పించాయి. ఈ అందాలను వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పర్యటకులు వస్తుంటారు. కేరళ, మధ్యప్రదేశ్‌లోనే కాకుండా తమిళనాడులోని కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లోనూ ఈ పుష్పాలు కనిపిస్తుంటాయి.
నీల్‌కురంజి ప్రత్యేకత ఏంటి?
ఇది ఓ గడ్డిజాతికి చెందిన పువ్వు. గుబురుగా పెరిగే మొక్క పూలు పూస్తుంది. పేరుకు తగ్గట్టే నీలి రంగులో ఉండే ఈ పువ్వు.. దక్షిణభారత దేశంలోని పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని మొదటిసారిగి 1838 సంవత్సరంలో గుర్తించారు. అప్పటి నుంచి పుష్కరానికోసారి పూస్తున్నట్లు గుర్తించారు. పువ్వులు పూసిన తర్వాత వాటి విత్తనాలు ఆ ప్రాంతమంతా వెదజల్లినట్లుగా విస్తరిస్తాయి. తర్వాత కొన్ని రోజులకు ఆ మొక్కలు చనిపోతాయి. ఆ తర్వాత మళ్లీ 12 ఏళ్లకు ఈ విత్తనాలు మొక్కలుగా మారి పుష్పిస్తాయి. ఈ పువ్వులు పూసిన ప్రాంతమంతా నీలిరంగులో కనువిందు చేస్తుంది.
ఔషధ గుణాలూ ఎక్కువే