తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నోయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్​ రాట్నం - noida latest news

ప్లాస్టిక్​ వ్యర్థాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాట్నాన్ని నోయిడాలో  తయారు చేశారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కారణంగా పర్యవరణానికి హానికరమని ప్రజల్లో అవగాహన కల్పించేందుకే దీన్ని రూపొందించారు.

The world's largest plastic spinning wheel has been installed in Sector 94, Noida, as part of the message of not using banned plastic.
నొయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్​ రాట్నం

By

Published : Jan 2, 2020, 7:32 AM IST

నొయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్​ రాట్నం

ప్లాస్టిక్ భూతం కారణంగా పర్యావరణానికి ప్రమాదమని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న ఆలోచన చేశారు ఉత్తర్​ప్రదేశ్​ నోయిడా అధికారులు. ఇందులో భాగంగా సెక్టార్-94లోని మహామాయా పైవంతెన​ వద్ద 1300 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలతో భారీ రాట్నాన్ని రూపొందించారు.

14 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ రాట్నం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం దక్కించుకుందని నోయిడా అథారిటీ సీఈఓ రీతూ మహేశ్వరీ తెలిపారు. ప్లాస్టిక్​ నిషేధంపై ప్రజలకు అవగాహన కలిగించడమే ఈ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశమని చెప్పారు..

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ​ రాట్నాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆవిష్కరించారు. ఎంతో ఆకర్షణగా ఉన్న ఈ రాట్నం చూపరులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి : 'న్యూఇయర్​ కానుకగా రైల్ ఛార్జీలు, గ్యాస్​ ధరల పెంపు'

ABOUT THE AUTHOR

...view details