తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరసేవక్‌పురంలో 'మందిర'స్తంభాల రూపకల్పన

అయోధ్య రామమందిరం కోసం మూడు దశాబ్దాలుగా శిలలను శిల్పాలుగా మారుస్తూనే ఉన్నారు ఆ శ్రామికులు. కానీ సుప్రీంకోర్టు తుదితీర్పు ప్రకటించడానికి కొద్దిరోజుల ముందు  పనులు నిలిచిపోయాయి. సుప్రీం తీర్పు రామమందిరానికి అనుకూలంగా వెలువడిన నేపథ్యంలో పనులు జోరందుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి.

By

Published : Nov 10, 2019, 8:28 AM IST

కరసేవక్‌పురంలో 'మందిర'స్తంభాల రూపకల్పన

అది అయోధ్యలోని కరసేవక్‌పురం. మూడు దశాబ్దాలుగా అక్కడి శిల్పులు తదేక దీక్షగా ఒకటే పని చేస్తున్నారు. వాళ్ల చేతుల్లోని ఉలులు.. పెద్ద పెద్ద శిలలను అందమైన శిల్పాలుగా మలుస్తున్నాయి. స్తంభాలు, పైకప్పు, మెట్లు.. ఇలా ఆలయంలోని వివిధ భాగాలకు కావల్సిన వాటన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శిలలను సేకరించి అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రూపుదిద్దుతున్నారు.

1989 నుంచి ఇప్పటివరకు ఒక్కరోజూ అక్కడి శిల్పులు విశ్రమించలేదు. ఫలితంగా ఇప్పటికే అక్కడ 1.25 లక్షల ఘనపుటడుగుల రాళ్లను చెక్కారు. వీటితో ఆలయంలో ఒక అంతస్తు కట్టేయొచ్చు. రామజన్మభూమి న్యాస్‌ నేతృత్వంలో వందలాది మంది శిల్పులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.

ఒక్క గ్రాము ఇనుమూ వాడకుండా రాముడికి ఆలయం కట్టాలని భావించడం వల్లే ఇన్ని రాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికొచ్చే భక్తులు శిలలను ముట్టుకుని పరవశించిపోతూ.. అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. కరసేవక్​పురంలోని వీహెచ్‌పీ కార్యాలయంలో ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తునే ఉన్నారు. దేశ విదేశాల నుంచి పెద్ద మొత్తంలో రామాలయ నిర్మాణానికి నిధులు అందుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడేందుకు కొద్దిరోజుల ముందు పనులు నిలిపేసిన శిల్పులు సొంత ఊళ్లకు వెళ్లారు.

ఇదీ చూడండి : జల్​ఆమియా: వంటింటి వస్తువులతో మురికి నీటిశుద్ధి

ABOUT THE AUTHOR

...view details