ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ప్రజా శౌచాలయం గోడ కూలి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఉదయం ఏడున్నర గంటల సమయంలో అకస్మాత్తుగా శౌచాలయం గోడ కూలి అందులో ఉన్న మహిళపై పడింది. శిథిలాల మధ్యలో ఆమె కాలు ఇరుక్కుపోగా... స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ప్రజా శౌచాలయం గోడ కూలి మహిళ మృతి - mumbai crime news today
ముంబయిలో దారుణం జరిగింది. కుర్లాలోని ప్రజా శౌచాలయంలో గోడ కూలి మహిళ మృతి చెందింది.

గోడ కూలి... మహిళ బలి
ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మహిళను బయటకు తీశారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం.. మెరుగైన చికిత్సకోసం స్థానిక రాజవాడి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. మహిళ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.