ఆత్మ నిర్భర్ భారత్ పథకం మూడో విడత ప్యాకేజీలో భాగంగా.. వ్యవసాయ ఉత్పత్తుల అంతర్ రాష్ట్ర అమ్మకాలపై ఉన్న అడ్డంకులను తొలిగించాలని ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ ప్రకటన ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూర్చినట్లైందని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమంతోనే దేశ అభివృద్ధి దాగుందని మోదీ ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రైతులకు లబ్ది చేకూర్చి, దేశాన్ని స్వయం సమృద్ధివైపు నడిపించేందుకు మోదీ దూరదృష్టితో ఆలోచిస్తున్నారని తెలిపారు. శుక్రవారం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో.. రైతులకు లబ్ది చేకూర్చడమే కాకుండా వారికి ఆదాయాన్ని పెంచుతుందని భాజపా నేత జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.