భారత విద్యార్థుల అమెరికా ఆశలపై కరోనా వైరస్ తాత్కాలికంగా నీళ్లు చిమ్మింది. కొవిడ్ 19 తీవ్రతతో అగ్రరాజ్యం ఆరోగ్య అత్యయికస్థితి ప్రకటించింది. విశ్వవిద్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. కొన్నింటికి సెమిస్టర్ సెలవులు ప్రకటించారు. భారతదేశం నుంచి వచ్చే వారికి వీసాలు జారీ చేయకూడదని అమెరికా నిర్ణయించింది. ఇమిగ్రెంట్, నాన్-ఇమిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో వీసాల కోసం తీసుకున్న అన్ని అపాయింట్‌మెంట్లను రద్దు చేశారు. ఆ ప్రక్రియ మళ్లీ ఎప్పుడన్నది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. కేవలం అత్యవసర, దౌత్యపరమైన వీసాలను మాత్రమే జారీ చేయాలని భారతదేశంలోని తమ కార్యాలయాలకు అమెరికా స్పష్టం చేసింది.
ఆగస్టుకు వెళ్లే విద్యార్థులపై ప్రభావం
అమెరికాలో ఆగస్టు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఆ సీజన్‌లో అక్కడి కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులు ముందు సంవత్సరం డిసెంబరు నుంచి విశ్వవిద్యాలయాల ఎంపిక ప్రారంభిస్తారు. కళాశాల ఎంపిక తరువాత ఐ-20లను తెప్పించుకోవాలి. వర్సిటీల మూసివేతతో విద్యార్థులకు ఐ-20లు రావటంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఐ-20 వచ్చిన విద్యార్థులకు.. వీసా ఇంటర్వ్యూలు ఆలస్యం కానున్నాయి. వీసా జారీకి అనుమతించిన సమయంలో ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ పొందటం కూడా సమస్య అవుతుందేమోనన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తం అవుతోంది.
వసతిగృహాల మూసివేత