తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కదిలే సంగీత నిలయం ఆ రైలు...!

ప్రయాణం ఉల్లాసంగా సాగేందుకు సరదాగా అంత్యాక్షరి పాటలు పాడడం సాధారణమే. ప్రయాణమే కాదు రోజంతా ఉత్సాహంగా గడవాలని కోరుకుంటారు ఈ సంగీత ప్రియులు. అందుకే రోజూ రైల్లో ఉద్యోగాలకు వెళ్లే వీరంతా లంచ్​ బాక్సులతో పాటు సౌండ్​ బాక్సులు, మైకులు వెంట తెచ్చుకుంటారు.. అలరించే పాటలు పాడుకుంటూ గమ్యస్థానాలకు చేరుకుంటారు.

By

Published : Jul 19, 2019, 2:54 PM IST

కూ కూ కూ.. రైల్లో సరదా సరిగమపదనిసలు!

కూ కూ కూ.. రైల్లో సరదా సరిగమపదనిసలు!

సాధారణంగా రైలు ప్రయాణాల్లో పుస్తకాలు చదవడమో, పాటలు వినడమో, కిటికీలోంచి ప్రకృతిని ఆస్వాదించడమో చేస్తుంటాం. కేరళలో ఓ బృందం మాత్రం రైల్లో ప్రయాణం బోర్​ కొట్టకుండా ఉండేందుకు రోజూ చిన్నపాటి సంగీత కచేరి కార్యక్రమమే నిర్వహిస్తోంది.

కాసర్​కోడ్​లోని వివిధ చోట్ల పని చేసేవారంతా రోజూ రైల్లో ప్రయాణిస్తుంటారు. పాటలపై మక్కువ ఉన్న వారిలో కొందరు సరదాగా పాడడం ప్రారంభించారు. క్రమంగా సంగీత ప్రియుల సంఖ్య పెరిగి పెద్ద బృందంగా ఏర్పడ్డారు.

మొదట్లో సరదాగా పాడుకునే వారు ఇప్పుడు మైకులతో, నేపథ్య సంగీతం జత చేసి తమ గళాన్ని రైల్లోని ప్రయాణికులందరికీ వినిపిస్తూ వినోదం పంచుతున్నారు. ఇంకేముంది, తోటి ప్రయాణికులూ కాసింత సేదదీరుతున్నారు.

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వీరిని రైలు బోగీలో సంగీతమే కలిపింది. మానసిక ఉల్లాసం కోసం ప్రారంభించిన పాటలు వీరికి అదనపు ఆదాయాన్నీ తెచ్చి పెట్టాయి. వారి బృందానికి చిన్న చిన్న స్టేజ్​ల​పై పాడే అవకాశాలు వెల్లువెత్తాయి.

"నా స్నేహితుడు ఒకసారి నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు. నేనూ పాటలు పాడతాను. అయితే అంతకంటే ఎక్కువ ఆస్వాదిస్తాను. ఇక్కడ అందరూ పాడటం చూసి నాకు ధైర్యం వచ్చింది. నేను బాగా పాటలు పాడగలుగుతున్నాను. ఇక్కడున్న వాళ్లలో ఎక్కువ మంది ఇక్కడకు వచ్చిన తర్వాత పరిణతి సాధించినవాళ్లే".

- మనీశ్​, గాయకుడు

ఇక్కడ కొందరికి సంగీతంలో ప్రావీణ్యం ఉంది. మరి కొందరు సరదాగా పాటలు పాడుతుంటారు. వీరు మలయాళం మాత్రమే కాక తమిళం, హిందీ తదితర భాషల పాటలనూ ఆస్వాదిస్తారు. భిన్న మతాలు, భిన్న ఉద్యోగాలు చేసేవారంతా ఆహ్లాదంగా అలా పాటలు పాడుతుంటే భిన్నత్వంలో ఏకత్వం ఉట్టిపడుతోంది.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2 సిద్ధం... ఈ నెల 22న ప్రయోగం

ABOUT THE AUTHOR

...view details