తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్యుడిని కొట్టి చంపిన రోగి బంధువులు! - రోగి

చికిత్స పొందుతున్న సమయంలో రోగి చనిపోయాడని వైద్యుడిపైనే దాడికి దిగారు బంధువులు. ఆవేశంగా కొట్టి చంపేశారు.

వైద్యుణ్ని కొట్టి చంపిన రోగి బంధువులు!

By

Published : Sep 1, 2019, 5:28 PM IST

Updated : Sep 29, 2019, 2:06 AM IST

వైద్యుణ్ని కొట్టి చంపిన రోగి బంధువులు!
వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ దేశవ్యాప్తంగా డాక్టర్లు విధులు బహిష్కరించి మరీ నిరసనలు చేపట్టినా.. వారిపై దాడులు ఆగడం లేదు.

అసోం జోర్హట్ జిల్లాలోని టియాక్​లో రోగి బంధువుల దాడిలో ఓ సీనియర్ వైద్యుడు ప్రాణాలు విడిచాడు.

టియోక్ టీ గార్డెన్ లో వైద్యుడిగా పనిచేస్తున్న 73 ఏళ్ల డెబెన్ దత్తా చికిత్స చేస్తుండగా.. ఓ రోగి మృతిచెందాడు.

ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు దత్తాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వైద్యుణ్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇదీ చూడండి:బిడ్డకు కాలు విరిగితే బొమ్మకు కట్టుకట్టించిన తల్లి!

Last Updated : Sep 29, 2019, 2:06 AM IST

ABOUT THE AUTHOR

...view details