చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 107 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు ఈ మహమ్మారికి బలయ్యారు. ఇప్పటికే కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది కేంద్రం.
మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో 59 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఇప్పటివరకు అత్యధికంగా రాష్ట్రంలోనే 31 కేసులు నమోదయ్యాయి. మిజోరంలో 117 మంది కరోనా వైరస్ అనుమానితులను గుర్తించిన అధికారులు.. వారిని ఇళ్లలోనే నిర్బంధించారు. సోమవారం నుంచి కర్తార్‌పూర్ కారిడార్ పర్యటన, రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.