తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2019, 2:29 PM IST

ETV Bharat / bharat

దేశంలోనే అత్యంత ఎత్తయిన 'శివలింగం' ఇదే...

దేశంలోనే ఎత్తయిన శివలింగం.. కేరళలోని తిరువనంతపురంలో కొలువుతీరింది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్న.. ఈ శివలింగం ఆదివారం నుంచి భక్తుల పూజలు అందుకుంటోంది.

దేశంలోనే అత్యంత ఎత్తయిన 'శివలింగం'

దేశంలోనే అత్యంత ఎత్తయిన 'శివలింగం'

కేరళలోని తిరువనంతపురం చెన్​గల్‌లో దేశంలోనే అత్యంత ఎత్తయిన శివలింగం వెలిసింది. 111 అడుగుల ఎత్తుతో స్థానిక మహేశ్వరం శ్రీ శివ పార్వతి దేవాలయంలో కొలువుదీరిన ఈ లింగం.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది. మహాశివలింగానికి దేవాలయ మఠాధిపతి.. మహేశ్వరానంద స్వామి తొలిపూజ చేశారు. ఆదివారం నుంచి ఈ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు.

పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి మట్టి

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కాశీ, గంగోత్రి, గోముఖ్, గైముఖ్, రామేశ్వరం, దనుష్కోటి నుంచి తెచ్చిన మట్టిని.. ఈ శివలింగం నిర్మాణంలో ఉపయోగించారు. ఈ భారీ శివలింగం.. భక్తిభావాన్ని పెంచడం సహా అద్భుత నిర్మాణ శైలితో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఎనిమిది అంతస్థుల లింగం

8 అంతస్థులున్న ఈ లింగంలో... ధ్యాన సాధన కోసం ఆరు అంతస్థుల్లో మందిరాలను ఏర్పాటు చేశారు. యోగాలో ఉన్న.. మూలాధారా, స్వధిష్టానా, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ వంటి ఆరుచక్రాలకు ప్రత్యకంగా ఒక్కో ధ్యానమందిరాన్ని కేటాయించారు. వాటి బోధనలను భక్తుల అనుభవంలోకి తీసుకువచ్చేందుకు.. లింగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. మొదటి అంతస్థులో... 108 శివలింగాలు, 8వ అంతస్థులో కైలాస ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. అవి అంతిమంగా.. అహంబ్రహ్మాస్మి అనే భావన కలిగిస్తాయని లింగ రూపకర్తల భావన.

"స్వార్థంకోసం పరుగులు తీయడం శాంతి, సహజీవనానికి విఘాతం కలిగిస్తోంది. దేవున్ని మనలో పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. అది తెలియజేయడానికే ఈ మహాశివలింగాన్ని నిర్మించాం" అని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details