తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గజరాజుకు గండం- తగ్గిపోతున్న సంఖ్య - ఏనుగుల మనుగడకు ముప్పు

మన జాతీయ వారసత్వ జంతువు ఏనుగు మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. గజరాజులు ఆవాసాలను మానవులు ఆక్రమించుకోవడం వల్ల అవి ఎక్కడ ఉండాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆహారం కోసం, నీటి కోసం ఆ గజరాజులు పంట పొలాల్లోకి, ఊళ్లల్లోకి చొరబడుతున్నాయి. కనికరం లేని మానవులు వాటికి విషం పెట్టి, కరెంట్ షాక్ ఇచ్చి చంపుతున్నారు. దీనితో క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోతోంది.

THREAT FOR ELEPHANTS
గజరాజుకు గండం

By

Published : Jun 6, 2020, 6:35 AM IST

మన జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. గజరాజుల సంరక్షణకు ప్రభుత్వం, పర్యావరణవేత్తలు ఎంతో కృషి చేస్తున్నప్పటికీ వాటి మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేరళలో పేలుడు పదార్థాలు కుక్కిన పైనాపిల్‌ను తినిపించి ఓ చూడి ఏనుగును చంపిన అమానుషం దేశవ్యాప్తంగా ఇప్పుడు మానవతావాదులను కదిలించి వేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏనుగులు ఇలాంటి దారుణాలకు, ప్రమాదాలకుగురై మృత్యువాత పడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి మనుషులకు-ఏనుగులకు మధ్య సంఘర్షణ. ఏనుగుల నడవాలు (కారిడార్లు) తగ్గిపోవడం, వాటి నివాస స్థానాలను పొలాలుగా మార్చేయడం, వాటికి సరైనచోటు దొరకకపోవడం వంటి కారణాలతో అవి పంటలపైకి, ఊళ్లపైకి వస్తున్నాయి. దీనితో పలుచోట్ల స్థానికులు విషం ఇవ్వడం, కరెంటు పెట్టడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు ఏనుగు దంతాల కోసం అక్రమార్కులు వాటిని వేటాడుతున్నారు. రైలు ప్రమాదాల వల్ల కూడా అవి చనిపోతున్నాయి. ఫలితంగా దేశంలో ఏనుగుల సంఖ్య తగ్గిపోతోంది.

ఏనుగుల మనుగడకే ముప్పు

ఏనుగుల గణన

ప్రాజెక్టు ఎలిఫెంట్‌ ప్రారంభించిన అనంతరం దేశంలో ప్రతి 5 ఏళ్లకోసారి ఏనుగుల గణన చేపడుతున్నారు. ఇందులో భాగంగానే 2017లో 'సింక్రనైజ్డ్‌ ఎలిఫెంట్‌ పాపులేషన్‌ ఎస్టిమేషన్‌' పేరిట కేంద్రం వివరాలను వెల్లడించింది.

అత్యధికంగా కర్ణాటకలో

దేశంలో అత్యధికంగా కర్ణాటకలో 6వేలకు పైగా ఏనుగులున్నాయి. అసోం, కేరళ, తమిళనాడు, ఒడిశా, ఉత్తరాఖండ్‌, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, నాగాలాండ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో వీటి సంఖ్య 440 నుంచి 5,800 మధ్య ఉంది.

ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌

  • ఏనుగుల సంరక్షణకు ఉద్దేశించి వివిధ లక్ష్యాలతో భారత ప్రభుత్వం 1992లో 'ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌'ను ప్రారంభించింది.
  • ఏనుగులను వాటి నివాస ప్రాంతాలు, తిరుగాడే చోటే సంరక్షించడం
  • మనుషులకు, ఏనుగులకు మధ్య జరుగుతున్న సంఘర్షణలను తగ్గించడం
  • గజరాజుల సంరక్షణకు శాస్త్రీయ, ప్రణాళికాబద్ధ విధానాలను అవలంబించడం
  • ఏనుగు దంతాల అక్రమ వ్యాపారాన్ని నిరోధించడం
  • వేటగాళ్ల నుంచి ఈ వన్యప్రాణులను కాపాడటం
    ఏనుగుల గణాంకాలు

ఇదీ చూడండి:కోతిని వేటాడిన చిరుత.. తెలివితో వానరం ఎస్కేప్​!

ఇదీ చూడండి:కశ్మీర్​లో భారీ వర్షాలు- కొట్టుకుపోయిన రహదారులు

ABOUT THE AUTHOR

...view details