మధ్యప్రదేశ్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. కాంగ్రెస్ సర్కారును బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించటాన్ని సవాల్ చేస్తూ.. మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం తీర్పు వెలువరించింది. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించడాన్ని సమర్థించింది.
'మధ్యప్రదేశ్ బలపరీక్షపై గవర్నర్ నిర్ణయం సరైనదే' - supreme court
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవాలని గవర్నర్ ఆదేశించడాన్ని సవాల్ చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్ రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది.
బలపరీక్షపై పిటిషన్ తిరస్కరణ
ఈ పిటిషన్పై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. 68 పేజీల వివరణాత్మక తీర్పు వెలువరించింది. రాజ్యాంగం, గవర్నర్ విచక్షణాధికారాలను తీర్పులో పేర్కొంది ధర్మాసనం. సరైన కారణం ఉన్నప్పుడు గవర్నర్.. బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రిని ఆదేశించడంలో ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టం చేసింది. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా గవర్నర్ ఈ అధికారాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
ఇదీ చూడండి:కరోనా కాలంలో బడుగులకు బతుకు భయం