పీవీ జీవితంలో ఎక్కువ మందికి తెలియని మరో పార్శ్వం ఉంది. ఆధ్యాత్మిక మార్గంలోనూ ఉన్నత స్థానానికి చేరుకున్నారాయన. దివంగత ప్రధాని రాజీవ్ నుంచి పీవీకి రాజకీయ ప్రోత్సాహం ఆగిపోయింది. 1990 ద్వితీయార్థంలో పీవీ అమెరికాలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి వచ్చారు. రాగానే ఆయనకు కుర్తాళంలోని సిద్ధేశ్వర పీఠం నుంచి సందేశం వచ్చింది. తమిళనాడులో ఆ పీఠం ఉంది. ఆదిశంకరాచార్య సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు స్థాపించిన పీఠమది. ఆ ఆశ్రమాన్ని పీవీ తరచూ సందర్శిస్తుండేవారు. అక్కడి సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ పీఠాధిపతి అయిన మౌనస్వామి శివసాయుజ్యం పొందాక ఆయన వారసుడి కోసం ఆశ్రమం అన్వేషించింది. పీవీయే ఇందుకు తగిన యోగ్యుడని ఆశ్రమం భావించి సందేశం పంపింది. అప్పటికి పీవీ ఆ ఆహ్వానాన్ని వెంటనే అంగీకరించలేదు. అలాగని తిరస్కరించనూ లేదు.
పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠాన్ని అధిరోహించి - spiritual aspect
పీవీ నరహింహారావు.. బహుముఖ ప్రజ్ఞశాలిగా, రాజనీతిజ్ఞుడిగా సుపరిచితమే. కానీ, ఆయనలో చాలా మందికి తెలియని ఇంకో కోణం ఉంది. ఆధ్యాత్మిక మార్గంలోనూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఓ దశలో పీఠాధిపతి అయ్యేందుకు సిద్ధమయ్యారు కూడా. 1991లో జరిగిన అనూహ్య పరిణామాలతో ప్రధాని పీఠాన్ని అధిరోహించారు.
1991 ఎన్నికల్లో పీవీకి టికెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మేనిఫెస్టో బాధ్యతలు అప్పగించింది. ఇక రాజకీయ జీవితం ముగించాల్సిన సమయం వచ్చిందని పీవీ నరసింహారావు భావించారు. కుర్తాళం పీఠం బాధ్యతలు స్వీకరించడానికి దాదాపుగా సిద్ధమయ్యారు. 1990లో పీఠం వారు పంపిన ఆహ్వానాన్ని అంగీకరించే దిశగా ఆలోచిస్తున్నట్లు సందేశం పంపారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరగవు. 1991 మే 21న రాజీవ్‌గాంధీ.. హత్యకు గురయ్యారు. సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి నిరాకరించారు. ఎంతో మంది ఉద్ధండులు పోటీ పడినా సొంత వర్గమంటూ లేని పీవీకి పగ్గాలు అప్పచెప్పడానికి సోనియా మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించినా సాధారణ మెజారిటీకి దూరంగానే ఉంది. ప్రధాని పదవికీ పలువురు నేతలు పోటీ పడినా చివరికి సోనియా పీవీవైపే మొగ్గు చూపారు. ఆయన సారథ్యంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత అంతా చరిత్రే.
ఇదీ చూడండి: పీవీ నరసింహారావుజీ ఓ 'కర్మ యోగి': మన్మోహన్