తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదేళ్లుగా 'కరోనా'తో ఆనందాల కాపురం - wmona's name corona

కేరళకు చెందిన ఓ వ్యక్తి.. పదేళ్లుగా కరోనాతో ఒకే ఇంట్లో కాపురం ఉంటున్నాడు. కష్టసుఖాలు పంచుకుంటూ, తన ఇద్దరు బిడ్డలకు తల్లిగా చిరునవ్వులతో బాధ్యతలు నిర్వర్తిస్తోంది కరోనా. మరి, ఆ కరోనా కథేంటో చూసేద్దాం రండి..

the-smiling-corona-from-kottayam-in-kerala-this-corona-went-viral-in-kerala
పదేళ్లుగా 'కరోనా'తో కాపురం

By

Published : Sep 17, 2020, 6:21 PM IST

కేరళ కొట్టాయం జిల్లాలో చిరునవ్వుల 'కరోనా' ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ప్రపంచమంతా కరోనా మా ఇంటికి రావద్దని కోరుకుంటుంటే... పదేళ్ల క్రితమే ఓ వ్యక్తి కరోనాను కోరి పెళ్లి చేసుకున్నాడని ఊరంతా కోడై కూస్తోంది.

పదేళ్లుగా 'కరోనా'తో కాపురం!

కొట్టాయం జిల్లా, మల్లుస్సరికి చెందిన షినే థామస్ ఓ జాలరి. పదేళ్ల క్రితం కరోనాను పెళ్లి చేసుకున్నాడు. కరోనా అంటే వైరస్ కాదండోయ్. థామస్ సతీమణి పేరు 'కరోనా'. థామస్, కరోనా దంపతులకు ఇద్దరు సంతానం. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత ఊరంతా థామస్ కరోనా జంటపై జోకులు వేసుకుని నవ్వుకున్నారు. తన పిల్లలు కూడా.. 'కరోనా అమ్మ' అని పిలుస్తున్నారు.

కరోనా కుటుంబం

అయితే, ఇప్పుడు ఆ వింత పేరుతోనే ఫేమస్ అయ్యింది కరోనా. ఎగతాళిగా పిలిచినా తన పేరు అదే కదా అనుకుని చిరునవ్వుతోనే పలుకుతోంది. వానొస్తే నీరుకారే చిన్న ఇంట్లో చింతలన్నీ మనసులోనే దాచుకుని జీవిస్తోంది కరోనా.

ఇదీ చదవండి: 'చపాతి' ఉద్యమంతో తెల్లదొరలకు ముచ్చెమటలు!

ABOUT THE AUTHOR

...view details