వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని భారత సైనికాధిపతి ఎంఎం నరవణె తెలిపారు. సరిహద్దుల్లో భద్రత కోసం ముందస్తు మోహరింపు చేపట్టామని, సైనికులు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశ సమగ్రతకు ఎలాంటి నష్టం లేదని హామీ ఇచ్చారు.
"రెండు మూడు నెలలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, ఎప్పటికప్పుడు చైనాతో సైనిక, దౌత్య చర్చలు నిర్వహిస్తూనే ఉన్నాం. వీటిని కొనసాగిస్తాం. రెండు దేశాల మధ్య విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం. యథాతథ స్థితిని మార్చకుండా మన ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం."