మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ మధ్య శనివారం జరిగిన రహస్య భేటీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరు నాయకుల సమావేశంపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
'సామ్నా పత్రిక ఇంటర్వ్యూ కోసం ఫడణవీస్, రౌత్ కలిశారు. దానిపైనే చర్చించుకున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారం నుంచి తిరిగొచ్చాక ఇంటర్వ్యూ ఇస్తానని ఫడణవీస్ తెలిపారు. ఇందులో రాజకీయ కోణం లేదు' అని భాజపా ప్రతినిధి కేశవ్ ఉపాధే తెలిపారు. 'సామ్నా పత్రిక కోసం శరద్ పవార్‌ను ఇంటర్వ్యూ చేశాను. ఫడణవీస్, రాహుల్, అమిత్ షాలను కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను' అని రౌత్ అన్నారు. ఇతర పార్టీల నాయకులను కలవడం నేరమా.. అని వ్యాఖ్యానించారు రౌత్.