జులై 15 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. భారత్ నుంచి కూడా విదేశాలకు విమాన సర్వీసులు నడపబోమని స్పష్టం చేసింది. వీటిలో డీజీసీఏ అనుమతి పొందిన.. సరకు రవాణా విమానాలకు మాత్రం మినహాయింపు యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్ - అంతర్జాతీయ విమాన సర్వీసులు
17:34 June 26
జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్చి 23న విమాన సర్వీసులు నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మే 25న దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనప్పటికీ.. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'వందే భారత్ మిషన్'లో భాగంగా ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను పునః ప్రారంభించాయి.
16:44 June 26
జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్
జులై 15 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ). భారత్ నుంచి కూడా విదేశాలకు విమాన సర్వీసులు నడపబోమని స్పష్టం చేసింది. వీటిలో డీజీసీఏ అనుమతి పొందిన.. సరకుల రవాణా విమానాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.