తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం.. అంతంతమాత్రమే - రెండు రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం.. అంతంతమాత్రమే

హరియాణా, మాహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంది. అసెంబ్లీకి ఎన్నికైన మహిళల మొత్తం సీట్లలో కనీసం 10 శాతం కూడా లేదు. కేవలం 23 మంది మాత్రమే శాససనభకు ఎన్నికయ్యారు.

రెండు రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం.. అంతంతమాత్రమే

By

Published : Oct 25, 2019, 12:05 PM IST

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తూ హరియాణాలో హంగ్‌ ఏర్పడగా.. మహారాష్ట్రలో భాజపా-శివసేన కూటమి విజయం సాధించింది. అయితే ఈ ఫలితాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంది. అసెంబ్లీకి ఎన్నికైన మహిళల సంఖ్య మొత్తం సీట్లలో కనీసం 10శాతం కూడా లేకపోవడం గమనార్హం.

మహారాష్ట్రలో 23 మంది..

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తాజా ఫలితాల్లో కేవలం 23 మంది మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. భాజపా నుంచి అత్యధికంగా 17 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా.. వీరిలో 9 మంది విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి పంకజా ముండే, భాజపా సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే కుమార్తె రోహిణీ ఓటమి చవిచూశారు.

2014లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన మహిళల సంఖ్య కాస్త మెరుగుపడింది. 2014 ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి మొత్తం 277 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో 20 మంది గెలిచారు.

హరియాణాలో 9 మంది..

హరియాణాలోనూ మహిళల ప్రాతినిధ్యం దాదాపు ఇలాగే ఉంది. రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలుండగా.. తాజా ఫలితాల్లో 9 మంది మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇందులో కాంగ్రెస్‌ నుంచి నలుగురు, భాజపా నుంచి ముగ్గురు, జేజేపీ నుంచి ఒకరు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలవగా.. ఈసారి ఆ సంఖ్య మరింత పడిపోయింది. ప్రముఖ రెజ్లర్‌ బబితా ఫొగాట్‌ భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో గెలిచి హరియాణా కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా మంత్రి కవితా జైన్‌కు కూడా ఈసారి ఓటమి తప్పలేదు.

ఇదీ చూడండి: 'భాజపాతో కలిస్తే.. స్వతంత్రులపై పాదరక్షల వర్షమే'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details