తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళలపై ఆగని అకృత్యాలు... 'నిర్భయ'మేదీ? - rape

ప్రతిరోజు పత్రికల్లో అత్యాచారానికి గురైన బాలిక.. అనే వార్త లేకుండా ఉండటం లేదు. ఆడపిల్లల్ని దేవతలతో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భారతగడ్డపై నేడు బాలికలకు భద్రత కరవయ్యింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారులపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు. పోలీసులున్నారు. చట్టాలున్నాయి. కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ చట్టం వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా సమాజంలో పెద్దగా ఎలాంటి ఫలితమూ కనిపించట్లేదు.

nirbhaya_
నిర్భయం ఎక్కడ?

By

Published : Nov 30, 2019, 7:03 AM IST

దేశ రాజధాని దిల్లీలో 2012 డిసెంబరు 16న చోటుచేసుకున్న అత్యాచార ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్రం కఠినమైన నిర్భయ చట్టాన్ని తెచ్చింది. రాష్ట్రాలూ తమ పరిస్థితులకు అనుగుణంగా సొంత చట్టాలు రూపొందించాయి. మహిళల భద్రతకు ప్రత్యేక విభాగాలు, దళాలను ఏర్పాటుచేశాయి. అయినా మహిళలపై అకృత్యాలు ఆగడంలేదు. సరికదా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

ఆగని అత్యాచారాలు... నిర్భయ ఎక్కడ?

తాజాగా హైదరాబాద్‌ శివారులో, వరంగల్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలే ఇందుకు నిదర్శనాలు. 2012కన్నా ముందు అత్యాచారాలపై ఫిర్యాదుచేయడానికి మహిళలు పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చాక ఫిర్యాదులు, శిక్షల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ అత్యాచారాలూ ఎక్కువవుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) 2017 సంవత్సరం వరకు విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టీకరిస్తున్నాయి. (2018, 2019 గణాంకాలు ఇంకా వెల్లడికాలేదు).

ఆగని అత్యాచారాలు... నిర్భయ ఎక్కడ?

ఇదీ చూడండి : కేసుల కేటాయింపుపై సుప్రీంకోర్టు కొత్త రోస్టర్‌ విధానం

ABOUT THE AUTHOR

...view details