- మన వ్యవస్థలో లోక్‌సభ ఒక తీరమైతే, మరో తీరం రాజ్యసభ అని వాజ్‌పేయీ అన్నారు: ప్రధాని
- సభను అడ్డుకోవడం కన్నా చర్చా మార్గాన్ని ఎంచుకోవడం మంచిది: ప్రధాని
- సభ మధ్యలోకి వెళ్లకూడదని ఎన్సీపీ, బీజేడీ నిర్ణయించాయి: ప్రధాని
- ఆ నిర్ణయం కారణంగా ఆ పార్టీలకు రాజకీయంగా ఎటువంటి నష్టం వాటిల్లలేదు: ప్రధాని
- ఎన్సీపీ, బీజేడీ అనుసరిస్తున్న తీరును భాజపా కూడా పాటించాలని కోరుతున్నా: ప్రధాని
రాజ్యసభ 250వ సెషన్.. మోదీ 'ప్రత్యేక' ప్రసంగం - Rajya Sabha latest news
14:45 November 18
ఎన్సీపీ, బీజేడీపై మోదీ ప్రశంసలు
14:42 November 18
ఆర్టికల్ 370పై రాజ్యసభలో మోదీ ప్రసంగం
- ఆర్టికల్ 370ను ఈ సభే ఆమోదించింది, ఈ సభే దాన్ని తొలగించింది: ప్రధాని
- కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది: ప్రధాని
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యర్థులు కావు, భాగస్వాములనే విషయాన్ని ఇక్కడి సభ్యులు చెప్పాలి: ప్రధాని
- రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదు.. ఈ విషయాన్ని ఈ సభ ప్రతిబింబిస్తుంది: ప్రధాని
- 200వ సమావేశాలప్పుడు ప్రధానిగా వాజ్‌పేయీ ఉన్నారు: ప్రధాని
- పెద్దల సభను సెకండరీ హౌస్‌గా మార్చొద్దని వాజ్‌పేయీ హెచ్చరించారు: ప్రధాని
- రాజ్యసభ మద్దతు ఇచ్చే సభగా ఉండాలి: ప్రధాని
14:36 November 18
రాజ్యసభలో మోదీ అంబేడ్కర్ స్మరణ
- లోక్‌సభ సభ్యులు క్షేత్రస్థాయి అంశాలను చూస్తే రాజ్యసభ దూరతీరాలు చూస్తుంది: ప్రధాని
- ఈ సభ చరిత్ర సృష్టించింది, చరిత్రను చూసింది, చరిత్రను మార్చడంలోనూ కృషి చేసింది: ప్రధాని
- రాజ్యసభ శాశ్వత సభ, ఇది రద్దు కాదు, ఇక్కడకి సభ్యులు వస్తుంటారు వెళ్తుంటారు: ప్రధాని
- భారత సమాఖ్య విధానానికి రాజ్యసభ ఆత్మవంటిది: ప్రధాని
- విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారి అనుభవాలు దేశానికి ఉపయోగపడేలా రాజ్యసభ సహకరిస్తుంది: ప్రధాని
- దీనికి సరైన ఉదాహరణ బి.ఆర్.అంబేడ్కర్: ప్రధాని
- అంబేడ్కర్ వలన దేశానికి ఎంతో మేలు కలిగింది: ప్రధాని
- ఈ సభలో నిరంకుశత్వం ప్రబలకుండా సభ్యులు చూశారు: ప్రధాని
- మన ఆలోచనలు, తీరు, విధానాలే ఉభయసభల ఔన్నత్యాన్ని చాటిచెబుతాయని డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు: ప్రధాని
- డాక్టర్ రాధాకృష్ణన్ చెప్పిన మాటల విలువను తగ్గిస్తున్నామా, పెంచుతున్నామా అన్నది మనం గుర్తించాలి: ప్రధాని
- అనేక విషయాలను కొత్త కోణంలో చూసే అదృష్టం నాకు కలిగింది: ప్రధాని
- ముమ్మారు తలాక్ బిల్లు ఇక్కడ వీగిపోతుందనుకున్నారు.. కానీ ఇక్కడా ఆమోదం పొందింది: ప్రధాని
- వన్ నేషన్, వన్ ట్యాక్స్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి ఈ సభ ఎంతో ప్రేరణ అందించింది: ప్రధాని
- దేశానికి దిశానిర్దేశం చేసే పనిని తొలుత రాజ్యసభ చేపట్టింది, తర్వాతే లోక్‌సభ చేపట్టింది: ప్రధాని
14:25 November 18
రాజ్యసభలో ప్రధాని ప్రసంగం
- రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా రాజ్యసభలో ప్రధాని ప్రసంగం
- రాజ్యసభ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
- కాలం, పరిస్థితులు మారుతున్నాయి.. కాలంతో పాటు మారేందుకు ఈ సభ కృషి చేసింది: ప్రధాని
- ఈ మహోన్నత ఘట్టంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను: ప్రధాని
- ఒక సభ ఉండాలా, రెండు ఉండాలా అని రాజ్యాంగ సభలో చర్చ జరిగింది: ప్రధాని
14:22 November 18
మోదీ ప్రత్యేక ప్రసంగం
రాజ్యసభ 250వ సెషన్ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగం చేస్తున్నారు.
13:52 November 18
రాజ్యసభ 250వ సెషన్.. మోదీ 'ప్రత్యేక' ప్రసంగం
రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా పెద్దలసభలో ప్రత్యేక చర్చ జరిగింది. భారత రాజకీయాల్లో రాజ్యసభ పాత్రపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులకు వివరించారు. రాజ్యసభ మరింత మెరుగ్గా పనిచేసేందుకు 10 సూచనలు చేసిన వెంకయ్యనాయుడు.. 67 ఏళ్ల రాజ్యసభ ప్రయాణాన్ని సునిశితంగా పరిశీలించాలని సభ్యులను కోరారు.
- ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం : రాజ్యసభ ఛైర్మన్‌వెంకయ్యనాయుడు
- స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారత్‌అనేక సమస్యలు ఎదుర్కొంది: వెంకయ్యనాయుడు
- 1952లో హిందూ వివాహ చట్టం నుంచి 2019లో ముస్లిం మహిళల హక్కుల వరకు అనేక చట్టాలు చేశాం
- 5466 పని దినాలు పూర్తి చేసుకున్న రాజ్యసభ
- మనం చేసిన పనులను గుర్తుచేసుకొని వెన్ను తట్టుకునే సమయం ఇది: వెంకయ్యనాయుడు
- 1952లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యసభ ఎన్నో చట్టాలు చేసింది: వెంకయ్యనాయుడు
- లోక్‌సభ ఆమోదించిన బిల్లులకు రాజ్యసభ అడ్డంకిగా నిలవకూడదు: వెంకయ్యనాయుడు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాసిన వ్యాసాన్ని ప్రస్తావించిన వెంకయ్యనాయుడు
TAGGED:
Rajya Sabha latest news