అయోధ్య రామమందిరానికి సంబంధించిన ప్రతిపాదిత ఆలయ నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విట్టర్లో అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రామమందిరానికి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. పరిమిత సంఖ్యలో ప్రముఖులు హాజరుకానున్నారు. అంగరంగ వైభవంగా వేడుక చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.