తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెరుచుకున్న 'బద్రి' తలుపులు- మోదీ పేరుతో పూజలు

ఉత్తరాఖండ్​ రాష్ట్రంలో కొలువైన నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్​ ఆలయం తలుపులు నేడు తెరుచుకున్నాయి. ప్రధాన పూజారి సహా 28 మంది ఆలయబోర్డు సభ్యులు ఆలయంలోకి ప్రవేశించారు. ప్రజాశ్రేయస్సు కాంక్షిస్తూ ఘనంగా పూజలు నిర్వహించారు. ఛార్​దామ్ యాత్రలో భాగంగా భక్తులు ఈ ఆలయాన్ని చివరిగా దర్శిస్తుంటారు. ఈసారి లాక్​డౌన్ కారణంగా స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడంలేదు.

The portals of Badrinath Temple opened at 4:30 am today
తెరచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు

By

Published : May 15, 2020, 7:18 AM IST

Updated : May 15, 2020, 10:39 AM IST

ఉత్తరాఖండ్​లోని హిమాలయ ధామం బద్రినాథ్​ ఆలయం తెరుచుకుంది. ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు అతి కొద్ది మంది ఆలయ బోర్డు సభ్యుల మధ్య ఆలయ ప్రధాన పూజారి రావల్ ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచారు.

తెరచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు

ప్రధాని నరేంద్రమోదీ తరఫున ప్రజాశ్రేయస్సు కాంక్షిస్తూ తొలిపూజ నిర్వహించారు. ఈ పూజకు భక్తులు ఎవరూ హాజరు కాలేదు. అయినప్పటికీ ఆలయాన్ని 10 క్వింటాళ్ల పుష్పాలతో అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో బద్రినాథ్ ఆలయం దేదీప్యమైంది. ఈ క్రతువులో పాల్గొన్న వారందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించారు. ఆలయం తెరుచుకోవడం పట్ల భక్తులకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా అంతమొంది త్వరలోనే చార్‌ధామ్ యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన ఆకాంక్షించారు

దేదీప్యమానంగా అలరారుతున్న బద్రినాథ్ ఆలయం
బద్రినాథ్ ఆలయ వంతెన మార్గం
బద్రినాథ్ ఆలయం

ఉత్తరాఖండ్​లోని నాలుగు పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి, కేదార్​నాథ్​, బద్రీనాథ్​. భక్తులు ఛార్​దామ్ యాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.

ఇదీ చూడండి:కరోనా కష్టాలు: ఆతిథ్యమిచ్చే వారికే 'ఆసరా' కరవాయే!

Last Updated : May 15, 2020, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details