వచ్చే 16 ఏళ్లలో మన దేశ జనాభా 151.8 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు జనాభా వృద్ధి రేటు అంచనాలు చెబుతున్నాయి. 2011లో మన జనాభా 121.1 కోట్లు. ఇది ఏటా 1% చొప్పున వృద్ధి చెందడం వల్ల దేశంలో జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 368 నుంచి 462కి పెరగనుంది. ఇదే సమయంలో సంతాన సాఫల్యత తగ్గడం వల్ల ఒక ప్రాంతంలో ఒక ఏడాదిలో ప్రతి వెయ్యి మంది జనాభాకు అదనంగా చేరే శిశువుల సంఖ్య (క్రూడ్ బర్త్ రేట్) 19.6 నుంచి 13కి తగ్గిపోనుంది. ఒక ప్రాంతంలో ప్రతి లక్ష మందిలో చనిపోయేవారి సంఖ్య (క్రూడ్ డెత్ రేట్) స్వల్పంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనాభా వృద్ధిలో పట్టణాల నుంచే 73% ఉంటుంది.
2011-36 మధ్య 31 కోట్ల జనాభా పెరగనుండగా అందులో 17 కోట్ల వృద్ధి ఉత్తర్ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌లనుంచే ఉంటుంది. యూపీలోనే 19% వృద్ధి నమోదు కానుంది.